బాధిత కుటుంబాలకు వైసీపీ పరిహారం

VSP: సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన కుటుంబాలకు వైసీపీ రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. బుధవారం వెంకట్రావు కుటుంబసభ్యులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.