VIDEO: నాయుడుపేటలో ఇళ్లలోకి వర్షపు నీరు
TPT: నాయుడుపేటలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. చాలాచోట్ల కాలువల్లో పూడిక తొలగించలేదు. దీంతో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోందని స్థానికులు వాపోయారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆరోపించారు.