బోరుగడ్డకు ఊరట.. బెయిల్ మంజూరు

ATP: బోరుగడ్డ అనిల్ కుమార్‌కు ఊరట లభించింది. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌ను దూషించారంటూ అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. 90 రోజులుగా పోలీసులు చార్జ్ షీటు దాఖలు చేయకపోవడంతో అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.