VIDEO: పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ

VIDEO: పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ

NZB: బోధన్ బురుడు గల్లీలో ఉన్న పురాతన ఆలయ పునర్నిర్మాణానికి ఇవాళ భూమిపూజ నిర్వహించారు. మహాలక్ష్మీ ట్రస్ట్, పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.