నూతన ‌ఎంఈవోగా అప్పల రాముడు

నూతన ‌ఎంఈవోగా అప్పల రాముడు

SKLM: ఆమదాలవలస మండలం ఇన్‌ఛార్జ్ విద్యాశాఖ అధికారిగా అప్పలరాముడు బాధ్యతలు స్వీకరించారు. ఈయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యులుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో విధులు నిర్వహించిన ఎంఈవో గడ్డాపు రాజేంద్రప్రసాద్ ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఉన్నతాధికారులు ప్రస్తుతం ఇన్‌ఛార్జి ఎంఈవోగా అప్పలరాముడును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.