జామకాయ కోసిందని.. చిన్నారిని తాళ్లతో కట్టేసి!
హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. జామకాయలు కోసిందన్న కోపంతో, ఓ మాజీ ఆర్మీ అధికారి నాలుగేళ్ల చిన్నారిని కట్టేసి దారుణంగా హింసించాడు. చిన్నారి వేడుకున్నా కనికరం చూపలేదు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.