ధర్మపురిలో మంత్రి లక్ష్మణ్ ప్రత్యేక దర్శనం
JGL: స్వాతి నక్షత్రంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయాధికారులు స్వాగతం పలికి, స్వామివారి దర్శనం చేశారు. వేదపండితులు ఆశీర్వచనం, దేవస్థాన అధ్యక్షులు, అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.