కొత్తగూడలో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు రంగం సిద్ధం
MHBD: జిల్లాలోని కొత్తగూడ-గంగారం మండలాల రైతుల చిరకాల కల సాకారమవుతోంది. ఉమ్మడి మండలాల కేంద్ర బిందువుగా కొత్తగూడలో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అతి త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ మార్కెట్ యార్డ్ ఏర్పాటు జరుగుతుంది. ఈ మార్కెట్ వల్ల రైతులు తమ పంటలను సులభంగా అమ్ముకోవడం జరుగుతుందన్నారు.