గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
BHPL: కాటారం మండలం దామరకుంట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని, ముందస్తుగా టీకాలు వేయించడం ద్వారా వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.