'ప్రజల్లోనే నిలవండి.. ఆదర్శవంతంగా పనిచేయండి'
RR: నిరంతరం ప్రజల్లోనే నిలుస్తూ ఆదర్శవంతంగా పనిచేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు దిశా నిర్దేశం చేశారు. కొందుర్గు మండలం, ఫరూఖ్ నగర్ మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉందన్నారు.