శ్రీలంకలో చిక్కుకున్న మత్స్యకారుల విడుదలలో జాప్యం

శ్రీలంకలో చిక్కుకున్న మత్స్యకారుల విడుదలలో జాప్యం

KKD: తమిళనాడు నుంచి కాకినాడకు వస్తుండగా జీపీఎస్ పనిచేయక శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి వెళ్లిన నలుగురు మత్స్యకారుల విడుదల ఆలస్యమవుతోంది. వారిని అరెస్టు చేసి జాఫ్నా జైలుకు తరలించారు. విడిపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తున్నా, పోలీసు విచారణ జాప్యంతో విడుదలలో ఆలస్యం జరుగుతోంది. సెప్టెంబర్ 2న ఈ కేసు శ్రీలంక కోర్టులో తిరిగి విచారణకు రానుంది.