VIDEO: రైతులకు పత్తి స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించిన కలెక్టర్
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ముద్దునూరు, గొల్లపల్లె, మైసంపల్లె గ్రామాల రైతులకు పత్తి స్లాట్ బుకింగ్ విధానంపై జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కాపాస్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన విధానం, అవసరమైన పత్రాలు, సాంకేతిక ప్రక్రియల గురించి అధికారుల ద్వారా వివరించారు.