ప్రశాంతంగా రాయితీ రుణాల ఇంటర్వ్యూలు

CTR: చిత్తూరు నగరపాలక కార్యాలయంలో బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ ద్వారా అందించనున్న రాయితీ రుణాల కోసం చేపట్టిన ఇంటర్వ్యూలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఇందు కోసం నగరపాలక కార్యాలయంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టింది. మొదటిరోజు 824 మంది దరఖాస్తుదారులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ మేరకు అధికారులు పది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.