పిడుగు పడి ఒకరి మృతి

NRML: పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎల్వత్ గ్రామానికి చెందిన రాం జాదవ్(45) వ్యవసాయ పంట చేనులో పని చేస్తుండగా సాయంత్రం వర్షం కురవడంతో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.