VIDEO: వృధాగా పోతున్న నీరు.. పట్టించుకోని అధికారులు
KDP: ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైంది. నీటిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ గొప్పగా ప్రగల్భాలు పలికే అధికారులు పెద్ద ఎత్తున నీరు వృథా జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాజీపేట(మం) పుల్లూరు దళితవాడలో మినీ ట్యాంకు నుంచి నీరు పెద్ద ఎత్తున వృథాగా పోతోంది. ఎండాకాలంలో నీటిని వృథా చేయడం పట్ల ప్రజలు అధికారులు తీరును ప్రశ్నిస్తున్నారు.