BREAKING: ఫలితాలు విడుదల
TG: స్పోర్ట్స్కోటా పంచాయతీ కార్యదర్శుల ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది. 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం సమయంలో స్పోర్ట్స్ కోటా పోస్టులపై కొందరు కోర్టుకు వెళ్లడంతో.. పరీక్ష కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2021లో ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసి.. పరీక్ష పెట్టింది. అప్పుడూ అడ్డంకులు వచ్చాయి. ప్రస్తుతం అవి క్లియర్ కావడంతో ఫలితాలు విడుదల చేసింది.