పంత్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీలక సలహా

పంత్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీలక సలహా

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అరోన్ ఫించ్ LSG కెప్టెన్ పంత్‌కు కీలక సూచనలు చేశాడు. 'ఓ వైపు కెప్టెన్‌గా.. మరో వైపు కీపర్‌గా చేయటం చాలా కష్టం. ఓవర్ల మధ్య బౌలర్‌తో మాట్లాడటానికి, సూచనలు చేయటానికి కుదరుదు. దీంతో బౌలర్, కెప్టెన్ మధ్య సమన్వయం సరిగా కుదరకపోవచ్చు. అందుకే పంత్ తన వికెట్ కీపింగ్ బాధ్యతలను నికోలస్ పూరన్‌కు అప్పగించాలి' అని సలహా ఇచ్చాడు.