గుజరాత్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకు కేయూ విద్యార్థి ఎంపిక
WGL: గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ పటేల్ యూనివర్సిటీలో ఈనెల 22 నుంచి జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకు కాకతీయ యూనివర్సిటీ బీటెక్ స్టూడెంట్ సాయి కుందన్ ఎంపికయ్యాడు. తెలంగాణ నుంచి మొత్తం 10 మంది ఎంపికైతే అందులో కుందన్ ఒకరు. 10 రోజుల పాటు జరిగే వేడుకల్లో తెలంగాణ కల్చర్, చేతి వృత్తులు, కళారూపాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నాడు. పేరిణి నృత్యాన్ని ప్రదర్శించనున్నాడు