కాంగ్రెస్‌పై మాజీ మంత్రి విమర్శ
WNP: మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్‌పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిగి పర్యటన కోసం వెళ్తున్న హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడం తగదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేయకుంటే భయమెందుకని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా అని ద్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించిన రైతుల తరఫున BRS పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.