రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హనుమాన్ మాల దారులకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హనుమాన్ మాల దారులకు గాయాలు

MNCL: హాజీపూర్ మండలం గుడిపేట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హనుమాన్ మాల దారులు తీవ్రంగా గాయపడ్డారు. నస్పూర్ వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడటంతో సీతారాంపల్లికి చెందిన తిరుపతి, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు.