పెరిక సంఘం లీగల్ అడ్వైజర్‌గా నాగరాజు నియామకం

వరంగల్ జిల్లాకు చెందిన అల్లం నాగరాజు తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం లీగల్ అడ్వైజర్‌గా నేడు నియమితులయ్యారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు మద్ద లింగయ్య ఈ మేరకు నియామక పత్రాన్ని నాగరాజుకు అందించారు. 20 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో రాణించడంతోపాటు సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న నేపథ్యంలో లీగల్ అడ్వైజర్‌గా నియమించినట్లు తెలిపారు.