నగర GMPS కార్యదర్శిగా మధుకర్
వరంగల్ జిల్లా గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) కార్యదర్శిగా నర్సంపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పరికి మధుకర్‌ను ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రకటించారు. నూతన కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ.. గొల్లకురుమలు, గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.