నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
RR: షాద్‌నగర్ పట్టణంలో 11 కేవీ శుభం లైన్‌పై చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో న్యూ సిటీ కాలనీ, విద్యుత్ కాలనీ, మల్లికార్జున కాలనీ, ప్యారడైజ్ కాలనీ, ఆదర్శ కాలనీ, భగీరథ కాలనీ, అల్కాపురి కాలనీలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.