ఆర్టీసీ డ్రైవర్ నిజాయతీ.. 4 తులాల బంగారం అప్పగింత
కామారెడ్డి - సికింద్రాబాద్ బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన బ్యాగును డ్రైవర్ సాయన్న అధికారులకు అప్పగించి నిజాయతీ చాటుకున్నారు. అందులో 4 తులాల బంగారం, నగదు, పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఈ సమాచారం అందుకున్న బాధితురాలు అధికారుల వద్దకు రాగా, సరైన ఆధారాలు పరిశీలించి ఆమెకు బ్యాగును అందజేశారు. డ్రైవర్ సాయన్నను ఆర్టీసీ అధికారులు, ప్రయాణికులు అభినందించారు.