అయ్యప్ప మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అయ్యప్ప మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామంలో నిర్వహించిన స్వామి అయ్యప్ప మహోత్సవంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి ఆశీస్సులు పొందారు. అలాగే స్వామి దీవెనలు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.