రోడ్డుపై నిలిచిన బస్సు.. ప్రయాణికుల ఇబ్బందులు
ASR: పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సు, శనివారం ఉదయం ఘాట్ రోడ్డులోని మోదకొండమ్మ పాదాల సమీపంలో నడిరోడ్డుపై మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో, ఇరుకైన ఘాట్ రోడ్డులో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.