విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు: కలెక్టర్
VSP: విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, కాలుష్య కారకాలను గుర్తించి వాటి తీవ్రత తగ్గించేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.