అరసవిల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ అరసవిల్లిలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మృతులకు సంతాపం తెలిపి మౌనం పాటించారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.