కృష్ణపట్నం పోర్టులో 2వ ప్రమాదపు హెచ్చరిక జారీ
NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం నేపథ్యంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాదపు హెచ్చరికను జారీ చేశారు. 29వ తేదీకి అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా మారనున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. పోర్టుకి దూరంగా తుఫాను ప్రభావం ఉన్నప్పుడు పోర్ట్ నుంచి వెళ్లే ఓడలకు జాగ్రత్తలను సూచిస్తూ రెండో ప్రమాదపు హెచ్చరిక జారీ చేశారు.