హెల్మెంట్ ధరించి బైక్ నడపాలి: ఎస్సై

హెల్మెంట్ ధరించి బైక్ నడపాలి: ఎస్సై

కృష్ణా: పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామ శివారులో, ద్విచక్రవాహనదారులందరూ హెల్మెట్ ధరించాలని ఎస్సై అర్జున్ సూచించారు. హెల్మెట్ ధరించని వారికి కొత్త హెల్మెట్లను కొనుగోలు చేయించారు. రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అన్నారు. రహదారి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.