బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని రహమత్ పూర్ సర్కిల్‌లో వైఎస్ఆర్ స్తూపాన్ని తొలగించడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. స్థూపాన్ని తొలగించి టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్కడికి పోలీసులు చేరుకోవడంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.