'అనాధ పిల్లలకు చేయూతనివ్వాలి'

కృష్ణా: కలెక్టర్ DK బాలాజీ అనాధ పిల్లలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి ఆమోద కమిటీ సమావేశంలో 36 దరఖాస్తుల్లో 23 సంరక్షణ కేంద్రాలకు అనుమతులు మంజూరు చేశారు. అనంతరం 15 మంది అనాధ పిల్లలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. వారికి విద్యలో అదనపు రిజర్వేషన్ సదుపాయాలు లభిస్తాయని తెలిపారు.