విద్యార్థులతో పనులు చేయించిన వారి పై చర్యలు తీసుకోవాలి

BHPL: మహదేవపూర్, చిట్యాల మండలాల్లో విద్యార్థులతో జెండా పనులు చేయించి వారి జీవితాలతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎమ్మార్పీఎస్(టీజీ) అధ్యక్షుడు రాజయ్య డిమాండ్ చేశారు. చిట్యాలలో జరిగిన ప్రమాదాన్ని శనివారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిన అధికారులపై సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.