'12 అంశాలపై బాలికలకు అవగాహన కల్పిస్తాం'

'12 అంశాలపై బాలికలకు అవగాహన కల్పిస్తాం'

ప్రకాశం: కిషోరి వికాసం వేసవి కార్యక్రమాన్ని మార్కాపురం ఐసీడీసీ ఆధ్వర్యంలో శుక్రవారం భగత్ సింగ్ కాలనీలో నిర్వహించారు. బాలికలు సమ్మర్ క్యాంపును వినియోగించుకోవాలని, విద్య, ఆరోగ్యం, క్రీడలు, సైబర్ నేరాలు, బాలల హక్కులు వంటి 12 రకాల అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సూపర్వైజర్ రవికుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.