'దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు'

WNP: దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర పాఠశాల స్వీపర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోషే కోరారు. జిల్లాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా స్వీపర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భదగా ఆయన మాట్లాడుతూ.. దళారుల పైరవీలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని కొందరు ఒక్కొక్క స్వీపర్ దగ్గర రూ. 5,200 వసూలు చేస్తున్నారన్నారు.