VIDEO: పులి దాడి.. లేగ దూడ మృతి
KKD: ఏలేశ్వరం మండలం డీ.కృష్ణవరంలో శనివారం పులి దాడిలో ఒక పెయ్యి దూడ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో పశువుల మందపై పులి దాడి చేసిందని, ఈ దాడిలో పెయ్యి దూడ మృతి చెందిందని తెలిపారు. పులి అడుగుజాడలు ఆధారంగా దాని సమాచారాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.