కేంద్ర అత్యవసర మందుల జాబితాపై చర్చ

GNTR: ప్రజారోగ్య పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం రూపొందించిన కేంద్ర అత్యవసర మందుల జాబితా (EML) ముసాయిదాపై గురువారం తాడేపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సిరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన సుమారు 297 రకాల మందుల ఆవశ్యకతపై సమావేశంలో వివరంగా చర్చించారు.