కళాశాల పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

కళాశాల పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

GDWL: గద్వాల శివారులో రూ.30 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అంతర్గత రహదారులు, తాగునీటి వసతి, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు వెంటనే కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించాడు.