VIDEO: సొమ్ము దాతలది ఫొటోలు సీఎం రేవంత్‌వి: మాజీ మంత్రి

VIDEO: సొమ్ము దాతలది ఫొటోలు సీఎం రేవంత్‌వి: మాజీ మంత్రి

వనపర్తి: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సందర్శనలో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యం కోసం సొంతంగా, దాతల సహాయంతో అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం సర్కార్ ఏకానా (నయా పైసా) ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం వాళ్ల ఫొటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటు అని ఘాటుగా విమర్శించారు.