'నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం'
WGL: నల్లబెల్లి మండలం ముచ్చింపుల, రంగాపురం, రేలకుంటలో ఏర్పాటు చేసిన నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతులను రాజులుగా నిలబెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఐకెపీ సేవలను వినియోగించుకోవాలన్నారు. దళారులను నమ్మో మోసపోవద్దు అని సూచించారు.