పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఫ్రీ బస్సు

NTR: ఆగస్టు 15న CM చంద్రబాబు నాయుడు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సిటీ టెర్మినల్‌లో ‘స్త్రీశక్తి’ పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్న ఈ పథకం ఏర్పాట్లను ఎన్జీఆర్ జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ బుధవారం సమీక్షించారు. ట్రాఫిక్, భద్రత, త్రాగునీరు, టాయిలెట్లు, శానిటేషన్ వంటి అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.