గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

వలస కార్మికులకు గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. గ్యాస్ సరఫరాను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. వర్షాకాలంలో గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.