నెట్టెంపాడులో మొసళ్ళు కలకలం

నెట్టెంపాడులో మొసళ్ళు కలకలం

GDWL: ధరూర్ మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో మొసళ్ళు కలకలం రేపింది. నిత్యం రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్ళే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎస్సీ కాలనీ వద్ద ఉన్న కుంటలో గత సంవత్సర క్రితం ఒక మొసలి చొరబడగా ఇప్పుడు దానితోపాటు మరో రెండు మొసళ్ళు తీవ్రంగా సంచరిస్తూ ఒడ్డుకు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.