ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
KDP: కొండాపురం మండలం వెంకయ్య కాల్వలో గంజి పార్వతి (36) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఆస్థి పంపకాల విషయంలో తరచూ భర్తతో గొడవ పడి, తన మాట వినలేదని మనస్థాపం చెంది క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు అన్న మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొండాపురం SI జయరాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.