పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీలు చేసిన జేసీ
NTR : ఏ. కొండూరు(M) కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలలో మధ్యాహ్న పథకం భోజనాన్ని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నాను. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో ఆర్డీవో కే. మాధురి, తహసీల్దార్ కే. లక్ష్మీ పాల్గొన్నారు.