ఈ నెల 14న గ్రామసభ
CTR: సదుం మండలం గొంగివారిపల్లెలో స్వామిత్వ రెండో విడత ప్రత్యేక గ్రామసభ శుక్రవారం జరగనున్నట్లు ఎంపీడీవో రాధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. గృహ యజమానులకు పీపీఎంలు జారీ చేస్తామన్నారు. కొలతలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని చెప్పారు. పాలమందలో ఈనెల 19న గ్రామ సభ జరుగుతుందన్నారు.