3 కిలోల గంజాయి పట్టివేత

మహబూబ్ నగర్: నర్సంపేటలో రూ. 87వేల విలువచేసే 3 కిలోల 450 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సంపేట పట్టణం శాంతి నగర్‌కు చెందిన హరి ప్రసాద్ ఫొటోగ్రఫీ పనిచేస్తూ వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోవడం లేదని గంజాయిని విక్రయించాలని అడ్డదారి తొక్కాడు. అజయ్ అనే మరొకరితో కలిసి ఒరిస్సాకు వెళ్లి గంజాయి తీసుకువస్తుండగా నర్సంపేటలో పోలీసులకు పట్టుబడ్డారు.