అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం రాత్రి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దీనిలో భాగంగా బాలగణపతి కోలాట బృందం మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. అలాగే హైదరాబాద్‌కు చెందిన రాధిక ఆర్ట్స్ అండ్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.