దసరా సెలవులపై ఎస్సై కీలక హెచ్చరిక

దసరా సెలవులపై ఎస్సై కీలక హెచ్చరిక

WGL: దసరా సెలవుల నేపథ్యంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నల్లబెల్లి ఎస్సై సూచించారు. చెరువులు, కుంటల వద్దకు పిల్లలను ఈతకు పంపకూడదని, నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. పండుగ సీజన్‌లో క్షణిక నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.