నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

BNR: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10గం" నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గృహప్రవేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నారాయణపూర్‌లో జీవ ఈసీ పౌల్ట్రీ ఫారం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆలేరులో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే రాజపేట మండలం పాముకుంటలో దుర్గమ్మ పండగ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.